వైరల్ అవుతున్న నమ్రత కామెంట్స్...!!

murali krishna
టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు, నమ్రతల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రీల్ లైఫ్ లో జంటగా నటించిన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా ఒకటైన విషయం తెలిసిందే.
వంశీ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చివరించగా అది కాస్త పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే.మహేష్ బాబు నమ్రత దంపతులకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.
అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన ఒకవైపు మహేష్ బాబు భార్యగా తన పిల్లలకు తల్లిగా బాధ్యతలను చేపడుతూనే, మరొకవైపు బిజినెస్ లు చూసుకుంటూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.అంతేకాకుండా తన భర్త మహేష్ కు సంబంధించిన విషయాలను కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది నమ్రత.
తరచూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబుకు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది నమ్రత.
ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను ఆమె పంచుకుంది.ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.
మోడల్ గా కెరియర్ బోర్ కొట్టి హీరోయిన్ గా మారాను అని తెలిపింది.అలాగే తన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అంటే మహేష్ బాబుతో లవ్ లో పడి పెళ్లిచేసుకోవడమే అని చెప్పుకొచ్చింది నమ్రత.
సాధారణంగా భార్యాభర్తల మాత్రం గొడవలు ఉంటాయి.అలా మీ మధ్య గొడవలు వస్తుంటాయా ఎవరి విషయంలో గొడవలు వస్తుంటాయి అని అడగగా.ఆ విషయం పై స్పందించిన నమ్రత.

మా ఇద్దరి మధ్య ఖచ్చితంగా మా పిల్లల వల్లే గొడవలు వస్తాయి.మా పిల్లలు అడిగినది నేను కాదు వద్దు అంటాను.
వెంటనే వాళ్ళు మహేష్ దగ్గరికి వెళ్ళగా మహేష్ అందుకు ఒప్పుకుంటాడు.దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి అని చెప్పుకొచ్చింది నమ్రత.
అలాగే సితార గురించి మాట్లాడుతూ.సితార ని తాము కోరుకోలేదని తను అన్ఎక్స్పెక్టెడ్ బేబీ అని చెప్పుకొచ్చింది నమ్రత.అలాగే గౌతమ్ పుట్టిన తర్వాత లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్పుకొచ్చింది నమ్రత.
మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి సినిమా అంటే ఎంతో ఇష్టమని, కానీ నమ్రత మహేష్ బాబు కలిసి నటించిన వంశీ సినిమా అంటే తనకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది నమ్రత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: