వామ్మో.. చరణ్ ధరించిన వాటి ధరలు తెలిస్తే మతిపోవాల్సిందే?

Purushottham Vinay
జక్కన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఆ తర్వాత వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత ధ్రువ, రంగస్థలం ఇంకా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక రామ్ చరణ్ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రం అయితే చరణ్ ను నెస్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో తారక్ తో పోటీ పడి నటించాడు చరణ్. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఔట్ ఫిట్ ఎప్పుడు కూడా సూపర్ స్టైలిష్ గా ఉంటుంది. సందర్భాన్ని బట్టి రామ్ చరణ్ డ్రసింగ్ అదిరిపోయేలా ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో అయితే చాలా రాయల్ గా కనిపిస్తాడు చరణ్.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ లావిషింగ్ హౌస్, లగ్జరీ కార్స్, హార్సెస్, పెట్స్, గాగుల్స్ ఇంకా అలాగే వాచెస్ .. వాటి ధరలు అయితే నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రామ్ చరణ్ చేతికి ఉన్న వాచ్  ఇంకా అలాగే షూస్ అండ్ శాండల్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి.రామ్ చరణ్ దరించిన వాచ్ పేరు రిచర్డ్ మిల్లే వాచ్. దీని ధర ఏకంగా రూ. 3,03,38,852. అలాగే చరణ్ వేసుకున్న షూస్ నైక్ వీటి ధర వచ్చేసి రూ.3,60,971. అలాగే చరణ్ వాడే శాండల్స్ గూచి వీటి ధర వచ్చేసి రూ. 53,300. ఇక రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: