అవతార్ 2: ప్లస్ & మైనస్ లు ఇవే?

Purushottham Vinay
"అవతార్ 2"సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో విజువల్స్ ఓ రేంజిలో ఉన్నాయి. అవతార్ వచ్చిన పదమూడేళ్ళలో టెక్నాలజీ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. అది ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా క్లారిటీగా కనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. అయితే విజువల్స్ సంగతి పక్కన పెట్టి కథ గురించి మాట్లాడుకున్నట్లు అయితే అంత  కొత్తగా ఫీలయ్యేది ఏమీ ఉండదు.అవతార్ 1లో నావిగా మారిన మనిషి మరో గ్రహానికి వెళ్లడం ఇక అక్కడ నావితో కలిసి ప్రేమలో పడటం, తమ ఉనికి కోసం పోరాటం చేయడం వంటివి చాలా కొత్తగా ఉన్నాయి. అయితే ఈసారి కథలో ఎటువంటి కొత్తదనం ఏదీ లేదు. జేమ్స్ కామెరూన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ కలిసి అవతార్ సినిమాను ఒక సగటు రివెంజ్ ఫార్ములా కథగా మార్చేశారు. 'అవతార్'లో పోరాటం అనేది అడవుల్లో సాగితే... 'అవతార్ 2'లో మాత్రం పోరాటం సముద్రంలోకి వచ్చింది. అయితే ఒక్కటి మాత్రం నిజం.సముద్ర గర్భంలో విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. టుల్‌కున్ ఫిష్ సన్నివేశాలు అయితే చాలా బావుంటాయి.


అయితే కథకు వస్తే... రెగ్యులర్ మన తెలుగు సినిమాల్లో చూసే సీన్స్ అనేవి కొన్ని గుర్తుకు వస్తాయి. 'అవతార్' ఇచ్చిన హై, 'అవతార్ 2' కి మాత్రం అంత ఇవ్వదు. టుల్‌కున్స్ వేట ఇంకా అమృతం కోసం సాగించే పోరాటం ఏదీ అంత ఆసక్తిగా ఉండదు.కేవలం విజువల్ వండర్ అనిపించే సీన్స్... అంతే తప్ప అంతకు మించి 'అవతార్ 2'లో ఏమీ లేదు. 'అవతార్' సినిమాను దృష్టిలో పెట్టుకుని సినిమాకు వెళితే... ఖచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు.అసలు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే విజువల్స్ ఎంజాయ్ చేసి రావచ్చు. యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ విషయంలో జేమ్స్ కామెరూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. మొత్తానికి కథ ఒక్కటే ఈ సినిమాకి మైనస్.. అదొక్కటి చూసుకుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది..బట్ విజువల్స్ లో కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేవారు ఈ సినిమా చూడొచ్చు. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. చాలా అద్భుతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: