జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం, యాదమ్మ రాజు..!?

Anilkumar
ఈటీవీలో ఎప్పటినుండో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే బుల్లితెరపై కోల్డ్ వార్స్ అనేవి సర్వసాధారణం. మల్లెమాల నుంచి ఇటీవల అనసూయ, సుధీర్, గెటప్ శ్రీను ,ఆది ఇలా చాలామంది బయటకు వెళ్లిపోవడం మనం చూసాం. అయితే మధ్యలో శ్రీను, ఆది ఇలా తిరిగి వచ్చారు. మల్లెమాల నుండి బయటకు రావడమే తప్ప లోపలికి వెళ్లడం ఉండదు. దీంతో మల్లెమాల టీం లో లోపల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు జబర్దస్త్ మల్లెమాలల్లోకి చాలామంది కమెడియన్స్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల చమ్మక్ చంద్ర బయటకు వచ్చేసాడని అందుకే సత్య కూడా బయటకు వచ్చేసింది అనే వార్తలు వినిపించాయి. కానీ  మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె దారిలోనే ఇప్పుడు సద్దాం ,యాదమ్మ రాజు కూడా మల్లెమాలకీ రియంట్రి ఇచ్చినట్లుగా తెలుస్తోంది .అయితే సద్దాం మరియు యాదమ్మ రాజులకు లైఫ్ ఇచ్చింది మల్లెమాల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యాంకర్ రవి శ్రీముఖి కలిసి చేసిన పటాస్ షో తో వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ షో ముగియడం, నాగబాబు మల్లెమాల నుంచి బయటకు రావడం ఒకేసారి జరిగాయి.

ఇక అదే సమయంలో జీ తెలుగులో అదిరింది షో ప్రారంభమైంది. ఇక కాంట్రవర్సీలు ఎక్కువ అవడంతో ఆ షో  కూడా ఆపేయడం జరిగింది. దాని అనంతరం ఆ టీం అంతా కూడా స్టార్ మా కి వెళ్లిపోయారు. అక్కడ కామెడీ స్టార్స్ అంటూ జబర్దస్త్ షోకు పోటీగా ఒక షోను ప్రారంభించారు .అయితే ఇప్పుడు మల్లెమాల కూడా వీరందరినీ వెనక్కి తెలుకొచ్చే పని  చేపట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. సద్దాం యాదమ్మ రాజులను మళ్లీ మల్లెమాలకు తీసుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ జబర్దస్త్ స్టేజ్ పై రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇది మా మాతృ సంస్థ తల్లి లాంటిది కాబట్టి మళ్ళీ వచ్చాము అంటూ డైలాగ్ కొడతాడు సద్దాం. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: