మసూద ఓటీటీ స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

Divya
ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన థ్రిల్లర్ హారర్ మూవీ మసూద. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మసూదా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఓటీటీ లో అలరించడానికి సిద్ధమయింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈనెల 21 నుంచి అటు తెలుగు, ఇటు తమిళ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన తిరువీర్ కు.. చాలా గ్యాప్ తర్వాత మంచి పాత్రతో కనిపించిన సంగీతకు మంచి క్రేజ్ వచ్చింది. దర్శకుడు మొదటి సినిమాతోనే అందర్నీ అలరించాడు.  ముఖ్యంగా ఈ సినిమాలో సంగీత క్యారెక్టర్ ప్రేక్షకులను ఒక్కసారిగా భయపెట్టేసిందని చెప్పాలి.  కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో పోషించారు.
మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఏడాదిలో క్లీన్ హిట్ అయిన జాబితాలోకి కూడా ఎక్కేసింది. ఇలా మసూద మంచి విజయాన్ని అందించింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి భయపెట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఆహా లో ఎలాంటి రికార్డు వ్యూస్ కొల్లగొడుతుందో చూడాలి. ఇప్పుడు ఆహాలో ఊర్వశివో రాక్షసివో అనే చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతుంది. మరి మసూద ఓ టీ టీ లో విడుదల అయ్యి ఎన్ని వ్యూస్ కొల్లగొడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ ఏడాది చిన్న సినిమాగా అంచనాలు లేకుండా విడుదలైన ఎన్నో సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకొని పెద్ద సినిమాలతో పోటీ పడడం గమనార్హం. ఏదిఏమైనా కొత్త డైరెక్టర్లు టాలెంట్ తో వస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: