బాలయ్య -పవర్ స్టార్ కాంబో... నిజమేనా..!!

murali krishna
నందమూరి బాలకృష్ణ అటు సినిమాలతోనే కాకుండా.. ఇటు అన్ స్టాపబుల్ షోతో కూడా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఎక్కిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 1తో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ.. సీజన్ 2లో కూడా అదే జోష్ ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఏ ఎపిసోడ్ కి ఏ గెస్ట్ ని పిలుస్తారో మన ఊహకి అందని విధంగా థ్రిల్ కి గురి చేస్తున్నారు. అన్ స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను పిలిచి రచ్చ రచ్చ చేశారు బాలయ్య. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో యువహీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్, శర్వానంద్ వంటి హీరోలతో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఆ తర్వాత నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలని కూడా షోకి పిలిచి ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించారు.
ఇదే షోలో చిరంజీవిని, నన్ను పెట్టి సినిమా ఎప్పుడు తీస్తున్నారని అల్లు అరవింద్ ని అక్కడే అడిగేశారు. అల్లు అరవింద్ కూడా దానికి అంగీకరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అవర్ డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని, గోపీచంద్ ని తన షోకి పిలవడం మరొక ఎత్తు. ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా బాగా వైరల్ అవుతోంది. ప్రభాస్ ని తీసుకొచ్చాడు.. నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తర్వాత ఎవరిని తీసుకొస్తారో తెలియదు గానీ సంక్రాంతికి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే సెకండ్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు హింట్ ఇచ్చారు బాలయ్య. ఆ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ కి కాల్ చేసి.. ‘ఎప్పుడొస్తున్నారు షోకి.. ఎవరితో రావాలో తెలుసుగా’ అని పవన్ కళ్యాణ్ వస్తున్న విషయాన్ని అప్పుడే కన్ఫర్మ్ చేశారు. అయితే ఏ ఎపిసోడ్ లో వస్తారో అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని పిలుస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14 నాడు ఎపిసోడ్ ప్రసారమయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ కి మహేష్ బాబుని తీసుకొచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ నవంబర్ 4న మొదలైతే.. ఆఖరి ఎపిసోడ్ ఫిబ్రవరి 4తో ఎండ్ అయ్యింది.
ఇప్పుడు సీజన్ 2 కొంచెం ముందు అంటే అక్టోబర్ 14న మొదలైంది కాబట్టి.. గత ఏడాదితో పోలిస్తే ఒక 20 రోజుల ముందు అంటే జనవరి 14తో ఎపిసోడ్ ముగుస్తుందని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ రాబోయే ఈ ఎపిసోడ్ తో ఆఖరి ఎపిసోడ్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ వస్తే గనుక సంక్రాంతికి మాస్ జాతరే. అభిమానులకి పిచ్చ పూనకాలు గ్యారంటీ. బాలయ్య షో చేయడమే భీభత్సం అనుకుంటే.. ఆ షోకి పవర్ సునామీ వెళ్తే ఆ భీభత్సం ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
అసలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే ఒక థ్రిల్లు. అభిమానులకు ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అసలు ఈ కాంబినేషన్ లో అప్పట్లో సినిమా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. కనీసం ఓటీటీలో ఒక అరగంట అయినా ఈ ఇద్దరూ కలిసి సంభాషించుకుంటే చూడాలని ఎందరో అభిమానులు, ప్రేక్షకుల ఆశ. మరి అభిమానుల ఆశలని నిజం చేస్తూ ఈ ఇద్దరూ.. సంక్రాంతి సందడి చేస్తారో లేదో చూడాలి. బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: