"పవన్ కి నాకు మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు"..షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన అలీ..!?

Anilkumar
సినీ  ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం లో బెస్ట్ ఫ్రెండ్స్ లలో పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఉన్న స్నేహం గురించి మన అందరికీ తెలిసిందే. పవన్ నటించే ప్రతి సినిమాలో కూడా అలీ కనిపించడం మనం గమనించవచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఏ సినిమా నైనా అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. అయితే వీరిద్దరి కామెడీ థియేటర్లలో ప్రతి ప్రేక్షకుడిని తెగ నవ్విస్తుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అని చెప్పాలి. 

ఇక గబ్బర్ సింగ్ సినిమా నుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఈ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని చిన్నగా ఏర్పడిన దూరం కాస్త పెద్దగా అయ్యిందని వార్తలు వచ్చాయి.ఇక ఇటీవల అలీ కూతురు పెళ్లికి సైతం పవన్ కళ్యాణ్ రాకపోవడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో గొడవ జరిగింది అని వార్తలు సైతం వస్తున్నాయి. పవన్ రాకపోవడానికి గల కారణాన్ని ఇటీవల వివరించారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య ఏర్పడిన మనసు మరదల గురించి చెప్పుకొచ్చాడు. ఇక అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షో ఇప్పుడు సరికొత్తగా ప్లాన్ చేశారు.

అయితే ఎప్పుడూ అలీ ఉండే స్థానంలో ఈసారి యాంకర్ సుమ కనిపించగా అలీ గెస్ట్ గా  రావడం జరిగింది. ఈ షోత్వరలోనే ముగిపోతుందని మరో షో తో మీ ముందుకు వస్తానని అలీ చెప్పాడు. ఇక ఈ షో ఇంతగా సక్సెస్ అయినందుకు పలు ప్రశ్నలు అడిగింది సుమ. ఇక ఈ షో తొలి రోజు మంచు లక్ష్మి ఇంటర్వ్యూ చేసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ కి మీకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని సుమ అడగగా అలీ... మా మధ్య ఎలాంటి గ్యాప్ రాలేదు క్రియేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి .అంతేకాదు వీరిద్దరి మధ్య ఎవరు గ్యాప్ క్రియేట్ చేశారు. అనే వార్తలు సైతం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: