థియేటర్ని దేవాలయం అంటున్న బాలకృష్ణ,ఆయన ఎందుకు ఎమోషన్ అయ్యారు........!!!

murali krishna
స్టార్ హీరో బాలకృష్ణ డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటి కీ అన్ స్టాపబుల్ షోను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేస్తూ ప్రశంసలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉండేలా జాగ్ర త్తలు తీసుకున్నారు.ఈరోజు బాలకృష్ణ ఏషియన్ తారక రామ థియేటర్ ను పునఃప్రారంభించారు.
థియేటర్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ మాట్లాడు తూ ఈ మూవీ థియేటర్ కు చరిత్ర ఉందని అన్నారు. ఏషి యన్ తారక రామ థియేటర్ మాకు దేవాలయం తో సమానం అని బాలయ్య పేర్కొన్నారు. తల్లీ దండ్రుల పేర్లు కలిసే విధంగా ఈ థియేటర్ ను ఏర్పాటు చేశామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ థియేటర్లో మొదట ప్రదర్శించబడిన సినిమా అక్బర్ సలీం అనార్కలి అని 1978 సంవత్సరంలో ఈ థియేటర్ ప్రారంభమైందని బాలయ్య పేర్కొన్నారు.
ఆ తర్వాత 1995 సంవత్సరం లో ఈ థియేటర్ ను పునఃప్రారం భించామని బాలకృష్ణ చెప్పు కొచ్చారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఈ థియేటర్ ను తీర్చిదిద్దామని ఎమోషనల్ అవుతూ బాలయ్య కామెంట్లు చేశారు. పర్సనల్ గా ఈ థియేటర్ నాకు సెంటిమెంట్ అని బాలకృష్ణ అన్నారు. నాన్న ఈ థియేటర్ లోనే మోక్షజ్ఞకు పేరు పెట్టారని ఆయన వెల్లడించారు. ఏషియన్ సినిమాస్ తో మాకు సత్సంబంధాలు ఉన్నాయని బాలయ్య పేర్కొన్నారు. 590 సీటింగ్ కెపాసిటీ తో ఉన్న ఈ థియేటర్ లో ఈ నెల 16వ తేదీ నుంచి అవతార్2 సినిమా ప్రదర్శితం కానుంది. రెక్లైనర్, సోఫాలు ఈ థియేటర్ లో అందుబాటు లోకి వచ్చాయి. ఏషియన్ తారకరామ హైదరాబాద్ లోని ఇతర మల్టీప్లెక్స్ లకు గట్టి పోటీ ఇవ్వ నుందని కామెంట్లు వినిపి స్తున్నాయి. వీరసింహా రెడ్డి మూవీ ఈ థియేటర్ లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: