ట్రైలర్స్ తో పోటీ పడబోతున్న విజయ్ - అజిత్..ఎప్పుడంటే..?

Divya
సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ, అజిత్ , విజయ్ తమ పాన్ ఇండియా చిత్రాలతో పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ట్రైలర్ తో పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు విజయ్ అలాగే అజిత్.. విజయ్ వారసుడు సినిమా విషయానికి వస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిసి బ్యానర్ల పై దిల్ రాజు, శిరీష్, పరం వీ పొట్లూరి, పెరల్ వీ పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్ర పోషిస్తున్న హీరో విజయ్.. ఈ సినిమా తమిళ్లో కూడా వారిసు పేరు మీద విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఈ సినిమా ట్రైలర్ను జనవరి ఒకటవ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరో వైపు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తునివు సినిమాను తెలుగులో తెగింపు పేరిట విడుదల చేస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమా ట్రైలర్ ని కూడా జనవరి ఒకటవ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. కొత్త ఏడాది అందులోనూ జనవరి ఒకటవ తేదీన అటు అజిత్ , ఇటు విజయ్ తమ సినిమాల ట్రైలర్స్ ద్వారా పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి . మరి తునివు సినిమా విషయానికి వస్తే అజిత్ హీరోగా హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి పోటీలో దిగింది.

ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి,  చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య,  విజయ్ నటించిన వారసుడు సినిమాలతో పాటు అజిత్ నటించిన తునివు సినిమా కూడా పోటీకి దిగబోతోంది. మరి ఈ నాలుగు చిత్రాలు కూడా సుమారుగా రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే. మరి ఏ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: