శ్రీ ముఖి కి లవ్ బ్రేకప్ అయ్యిందా..!?

Anilkumar
బుల్లితెరపై ఎప్పటినుండో యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా ఈమె ఏంతటి ఫాలోయింగ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. మొదట పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె దాని  తర్వాత ఎన్నో షోలకు యాంకర్ గా చేసింది. ఈ క్రేజ్ వల్లే ఆమె బిగ్ బాస్ సీజన్ 3 కి కూడా వెళ్ళింది. దానివల్ల ఈమెక్రీజ్ మరింత పెరిగింది .దీంతో సినిమాలలో కూడా శ్రీముఖికి అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈమె  సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో అలరించింది. 

వెండితెరపై మాత్రమే కాకుండా అడపాదడపా సినిమాలో నటిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యాంకర్ గా మాత్రం తనదైన స్టైల్ లో సుమ తర్వాత అంతటిస్తాయని అందుకుంది. అయితే గత వాలెంటైన్స్ డే రోజు సందర్భంగా శ్రీముఖి ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే అతను ఎవరో చెబుతాను అని కూడా ఈమె చెప్పింది. ఇంతకు ఆయన ఎవరు అనేది ఇప్పటివరకు ఆమె చెప్పలేదు .ఇప్పటివరకు తన ప్రేమ గురించి గానీ పెళ్లి గురించి కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. ఆమె అందంతో బుల్లితెరపై వెండితెరపై బాగా ఆకట్టుకున్న ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన హవా చూపిస్తుంది .

అయితే ముఖ్యంగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అని చెప్పాలి. అయితే ఈమెను ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ శ్రీముఖి ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది అంటే ఆ విషయాలను లైట్ తీసుకుంటుంది. శ్రీముఖి పెళ్లి విషయంలో మాత్రం ఆమె అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెర  మరియు వెండితెర అని తేడా లేకున్నా అందర్నీ ఆకట్టుకుంటున్న ఈమె ఇలాంటి సమయంలో ప్రేమ పెళ్లి అని పేరుతో కెరీర్ నాశనం చేసుకోకూడదు అని ఉద్దేశంతో ఆయన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. అయితే బుల్లితెర వర్గాల నుంచి మాత్రం శ్రీముఖి ఇంకా ప్రేమలోనే ఉందని వివాహం కూడా త్వరలోనే చేసుకుంటుంది అని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. కానీ శ్రీముఖి మాత్రం ఇప్పటివరకు ఇలాంటి విషయాలపై ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ విషయాలపై శ్రీముఖి స్పందిస్తుందా లేదా చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: