చిరంజీవి టాలీవుడ్ అక్షయ్ కుమార్ కానున్నాడా.. ఆందోళనలో ఫాన్స్..!

Divya
తినగా తినగా వేపాకైనా సరే తీయగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఏదైనా సరే చూస్తూ చూస్తూ ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. చూడడమే కాదు.. తినడం ..చేసే పని ఏదైనా సరే పదేపదే చేస్తూ ఉంటే కచ్చితంగా మన పని మనకే నచ్చదు. ఈ క్రమంలోనే చిరంజీవిపై ఎంతో ఆశలు పెట్టుకున్న అభిమానులు కూడా చిరంజీవి విషయంలో నిరాశలు కక్కుతున్నారు. అంతేకాదు చిరంజీవి మరో టాలీవుడ్ అక్షయ్ కుమార్ కానున్నాడు అంటూ కూడా వార్తలు వైరల్ చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆరు పదుల వయసులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న చిరంజీవి మంచి కంటెంట్ తో రావడం లేదు.  ఈయన నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ మూటగట్టుకుంటుంది. నాన్ స్టాప్ గా సినిమాలను విడుదల చేస్తుండడంతో అభిమానులు ఆసక్తిని కోల్పోతున్నారు. ఏదైనా అతిగా తినిపించినా సహజంగా ప్రేమను కోల్పోతుంది అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి దానికి చిరంజీవి సెట్ అవుతాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి క్వాంటిటీ కంటే క్వాలిటీని ఇష్టపడతారని ఆశిస్తున్నాము అంటూ కూడా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా కొంతమంది హీరోలు తమ సినిమాను రిలీజ్ చేయడానికి రెండు మూడు సంవత్సరాలు సమయం తీసుకుంటుంటే.. చిరంజీవి మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి తన సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పని చూస్తుంటే చిరంజీవికి క్వాంటిటీ అవసరం కానీ క్వాలిటీ అవసరం లేదు అన్నట్లుగా స్పష్టమవుతుంది.  ఎన్ని సినిమాలు తెరపైకి వచ్చినా క్వాలిటీ లేనివి ఏమాత్రం సక్సెస్ పొందలేవని కూడా ప్రేక్షకులు నిరూపిస్తున్నా.. చిరంజీవి ఎందుకో కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అని అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు . ఇకనైనా భారీ కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: