జూనియర్ లాంగ్ వెకేషన్ దేనికి సంకేతం !

Seetha Sailaja
టాప్ యంగ్ హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ లు తమ సినిమాల షూటింగ్ లతో చాల బిజీగా ఉంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖాళీగా ఉండటం అతడి అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలై 9 నెలలు దాటిపోయిన తారక్ కొరటాల శివ దర్శకత్వంలో నటించవలసిన మూవీ ఇంకా ప్రారంభం కాకపోవడం తారక్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది.

వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ ఈ నెలలో ధనుర్మాస రోజులు ప్రారంభం అయ్యాక షూటింగ్ ప్రారంభం అవుతుంది అంటూ లీకులు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే కొరటాల ఈమూవీ సంగీత దర్శకుడు అనిరుద్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు రావడంతో ఈ నెలలో ఈమూవీ ప్రాజెక్ట్ షూటింగ్ ఖాయం అని అందరూ అనుకున్నారు.

అయితే ఈ అంచనాలకు షాక్ ఇస్తూ తారక్ మరొక నిర్ణయం తీసుకోవడంతో అతడి అభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ తన భార్య పిల్లలతో కలిసి లేటెస్ట్ గా అమెరికా వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు చాలామంది ఆశ్చర్యపడినట్లు తెలుస్తోంది. తారక్ తన కుటుంబ సభ్యులతో అమెరికా దేశంలోని ఒక ప్రముఖ పట్టణానికి వెళ్ళి అక్కడ కొన్నిరోజులు సరదాగా గడపడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తారక్ రాబోతున్న క్రిస్మస్ న్యూయిర్ సెలిబ్రేషన్స్ ను తన భార్య పిల్లలతో కలిసి అమెరికాలో కొత్త సంవత్సరం వచ్చేవరకు అక్కడ ఉండి అక్కడ నుండి యూరప్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి సమయానికి తిరిగి హైదరాబాద్ వస్తాడని అంటున్నారు. తారక్ అమెరికా వెళుతున్నప్పుడు ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్ దగ్గర అతడిని చూసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేసారు. దీనితో మళ్ళీ మరొకసారి తారక్ కొరటాల మూవీ షూటింగ్ ఫిబ్రవరికి వాయిదా పడినట్లు లీకులు వస్తున్నాయి. ఇన్ని వాయిదాల మధ్య నిజంగా కొరటాల మూవీ ఉంటుందా లేదా అన్న విషయమై రకరకాల వార్తలు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: