ఆ స్టార్ హీరోయిన్ కారణంగా ఆగిపోయిన మెగాస్టార్ సినిమా..!?

Anilkumar
టాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .మెగాస్టార్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చిన కూడా ఆయన అభిమానులకు అది పండగ అని చెప్పాలి.. ఇక చిరంజీవి గురించి ఇప్పుడు చెప్పే వార్త చాలామందికి తెలియకపోవచ్చు. అయితే చిరంజీవి సినిమా ఒక హీరోయిన్ వల్ల ఆగిపోయిందట .నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమే. అయితే చిరంజీవి సినిమా ఒక హీరోయిన్ కారణంగా ఆగిపోయింది అని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి. అయితే ఇది ఇప్పుడు జరగలేదు చాలా సంవత్సరాల క్రితం జరిగింది.

అయితే అది కూడా అతిలోకసుందరి శ్రీదేవి కారణంగా చిరంజీవి సినిమా ఆగిపోయింది .ఇక హీరో అయినా హీరోయిన్ అయినా ఒక హోదా వచ్చాక ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు అన్న సంగతి తెలిసిందే. ఇక వారు చెప్పినట్టే వినాలని అనుకుంటూ ఉంటారు .ఇదే క్రమంలో నిర్మాతలను దర్శకులను వారితో కలిసి నటించిన అనంతరం బాలీవుడ్ ,టాలీవుడ్ రెండు పరిశ్రమంలోనూ తన హవా నడిపించిందట ఈమె.ఇక అదే సమయంలో శ్రీదేవి చేసిన ఒక పని కారణంగా చిరంజీవికి కోపం వచ్చిందట .దాంతో రెండు సినిమాలను ఆపేసారట చిరంజీవి. ఇక ఆ సినిమాలే మధురాల దొంగ కొండవీటి దొంగ.

అయితే కొండవీటి దొంగ సినిమాలో శ్రీదేవి కొన్ని మార్పులు చేసిందట. అంతే కాదు సినిమా పేరు కొండవీటి రాణి అని పెట్టాలని కూడా గొడవ చేసిందట. దీంతో చిరంజీవి ఆమెతో సినిమా చెయ్యను అంటూ గొడవ చేశారట. ఆ కొండవీటి దొంగ సినిమా విజయశాంతి రాధ తో కలిసి తర్వాత నటించడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చిరంజీవికి మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫైనల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: