రేవంత్ ని ఎలిమినేట్ చేయనున్న బిగ్ బాస్..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
నాగార్జున హోస్ట్ గా మాటీవీలో భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మరో వారంలో పూర్తవుతుంది. ఈ సీజన్ మొదలైనప్పటినుండి ఎంతో నెగిటివిటీని చోటుచేసుకుంది .వారం వారం ఊహించని కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం వల్ల ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది అందరిలో చాలా ఆక్తిని రేకెత్తుతోంది. అయితే తాజాగా 14వ వారం ఇనాయా ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. టాప్ 2 లో ఉండే ప్లేయర్ ఇలా ఎలిమినేట్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు . తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

 ఇందులో టాప్ ఫైనల్స్ కి వెళ్ళేది ఐదుగురి కాబట్టి అందులో ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది .నాగార్జున సైతం ఇప్పుడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రేవంత్ ఎలిమినేట్ అవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దానికి ప్రధాన కారణం బిగ్ బాస్  ఇప్పటివరకు మిగతా సీజన్లలో అన్నింటిలో విన్నర్ అయ్యే వ్యక్తి జర్నీ వీడియోని చివరన చూపించేవారు. కానీ ఈసారి మాత్రం రేవంత్ విన్నర్ అని అందరూ భావించారు.

దీంతో బిగ్ బాస్ మాత్రం రేవంత్ జర్నీ వీడియోని అందరికన్నా ముందే చూపించే సాడు.రేవంత్ జర్నీ వీడియో చూపించడం పై చాలామంది బిగ్ బాస్ వీక్షకుల్లో అనుమానం మొదలైంది .ఇక ఈసారి రేవంత్ విన్నర్ అవుతాడు అని అందరూ భావించారు. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి రేవంత్ జర్నీ వీడియోని ముందుగానే చూపించడంతో ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి .ఇక ఇనాయని ఎలిమినేట్ చేసినట్టే రేవంత్ ని కూడా ఎలిమినేట్ చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ ని ఎలిమినేట్ చేసి ఎవరిని టైటిల్ విన్నర్ చేస్తారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఒకవేళ రేవంత్ ఎలిమినేట్ అయితే మాత్రం వారి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇంకో రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: