బాలయ్య ని ఏకంగా సీఎం చేసిన పరశురాం.. ఫాన్స్ కి పండగే..!?

Anilkumar
నట సింహం నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుకుపోకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో స్పీడు పెంచేశాడు. ఆయన నటిస్తున్న 107వ సినిమా రిలీజ్ కాకుండానే 108వ సినిమా ప్రారంభించేసాడు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా మూడు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పరశురాం డైరెక్షన్లో కూడా బాలయ్య సినిమా వస్తుందని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి .గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రానుందని సమాచారం. ఇక గీతగోవిందం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సర్కార్ వారి పాట సినిమా చేసిన ఈయన

 ఆ సినిమా అనంతరం ఎటువంటి హిట్ అందుకోలేదు. ఈ సినిమా తర్వాత పరశురాం ఎవరితో సినిమా చేస్తాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలకృష్ణతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా లో బాలకృష్ణ నీ సీఎంగా చూపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఆల్రెడీ పొలిటికల్ నేపథ్యంలో ఉన్న బాలయ్య ఇప్పుడు రీ లైఫ్ లో కూడా అలాంటి పాత్ర చేస్తే ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తారు. అంతే కాదు సీఎంగా బాలకృష్ణ అనగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే బాలకృష్ణ సినిమాలు చేస్తున్న రీతి చూస్తుంటే ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి .

ఇక ఈయన నటించిన వీర సింహారెడ్డి తర్వాత సమ్మర్ లోనే అనిల్ రావు పూడి సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇక పరశురాం సినిమాని కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈయన డైరెక్షన్లో ఆదిత్య 999 మాక్స్ సినిమా చేయాలని చూస్తున్నారట బాలకృష్ణ. ఇక ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే 107 నుంచి 110 వరకు బాలయ్య సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బాలకృష్ణ సినిమాలే కాకుండా మరోవైపు అన్ స్టాప్ తో బిజీగా ఉన్నాడు .ఇక సీజన్ వన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వడంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా అదే సక్సెస్ తో ముందుకు సాగుతోంది .అయితే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో 6 వ ఎపిసోడ్లో గెస్ట్ గా ప్రభాస్ రానున్నాడు. దీనితో ఆ ఎపిసోడ్ను కూడా  త్వరలోనే రిలీజ్ చేయనుంది ఆహా టీం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: