రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డకు.. పెట్టె పేరు అదేనా?

praveen
ఎన్నో ఏళ్లుగా నిరీక్షణగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులందరికీ కూడా పండగ లాంటి న్యూస్ అందింది అన్న విషయం తెలిసిందే. అభిమానులు అందరూ కూడా మెగా వారసుడు కోసం దాదాపు 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అటు రామ్ చరణ్, ఉపాసన గుడ్ న్యూస్ చెప్పలేదు. ఇక ప్రతిసారి రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని వార్తలు సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి అని చెప్పాలి. కానీ చివరికి ఇవి పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం అసలు సిసలైన శుభవార్త ప్రేక్షకులకు అందింది.

 రామ్ చరణ్, ఉపాసన ఇక మరికొన్ని రోజుల్లో పేరెంట్స్ కాబోతున్నారు అన్న ఒక శుభవార్తను అభిమానులకు మెగా స్టార్ చిరంజీవి ఇక తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు అని చెప్పాలి. దీంతో తాను తాత కాబోతూ ఉండడం పై  మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన మొదటి సంతానానికి జన్మ ఇవ్వబోతున్నారు అంటూ ట్విట్టర్ లో తెలిపాడు చిరంజీవి. అయితే ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త అందిందో లేదో అప్పుడే పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు అన్న వార్త కూడా చక్కర్లు కొడుతుంది.

 ఈ క్రమంలోనే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. చిరంజీవి కుటుంబ వారసులు అందరికీ కూడా చివర్లో తేజ్ వచ్చే విధంగా పేరు పెట్టారు. కాబట్టి ఒకవేళ రామ్ చరణ్, ఉపాసనలకు మగ బిడ్డ పుడితే అంజన్ తేజ్ అని పేరు పెట్టే అవకాశం ఉందట. ఒకవేళ ఆడబిడ్డ పుడితే అంజలి అని పేరు పెట్టాలని రామ్ చరణ్ ఉపాసనలు కూడా ఎప్పుడో ఫిక్స్ అయ్యారు అనేది తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఉపాసనకి మూడు నెలలు కాక మరో ఆరు నెలల వరకు వరకు ఇక వారసుడు కోసం మెగా అభిమానులు అందరూ కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: