బ్యూటీ ఆదా శర్మ కు నో ఆఫర్స్..!!

murali krishna
 తాలీవుడ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదా శర్మ. ఈ బ్యూటీ గురించి మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ..
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన నటనతో బాగా అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. 2008లో హారర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఈ నటి ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటి అవార్డు కూడా  అందుకుంది మరీ. ఆ తర్వాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది.
ఇక ఆ తర్వాత పలు సినిమాలలో  చాలానే అవకాశాలు అందుకున్న కూడా అంత  మెరుగైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ బ్యూటీ. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా తన పాత్ర అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక బుల్లితెరపై కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది.
ఇక సోషల్ మీడియా లో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది తన డాన్స్ వీడియో లతో బాగా  తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇక తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేసుకుంటుంది. నిత్యం ట్రెండీని ఫాలో అవుతూ ఉంటుంది.
ఇక తన అందాలతో కుర్రాళ్లను ఒక్కసారిగా తన వైపు మలుపుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషలో  కూడా బాగా బిజీగా ఉంది ఆదాశర్మ. అక్కడ బాగానే అవకాశాలు అందుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో షేర్ చేసుకుంది. అయితే ఆ వీడియోలో తను కాస్త భయంకరంగానే కనిపించింది. నిజానికి చెప్పాలంటే అదేదో హారర్ కి సంబంధించిన వీడియో లాగా ఉంది.
అందులో తన గెటప్, తన ఎక్స్ప్రెషన్స్ మాత్రం  చాలా భయం పుట్టించేలా ఉన్నాయి. పైగా మధ్యలో తన ఫేస్ కూడా దెయ్యంలా మారడంతో ఏదో తేడాగా అనిపించింది మరీ. అయితే ఇది తన సినిమాకు సంబంధించిందేమో అన్నట్లుగా అనిపించింది. ఇక ఆ వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అచ్చం దెయ్యంలాగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరి కొంతమంది అవకాశాలు లేకపోయేసరికి.. ఇటువంటి వేషాలు కూడా వేస్తున్నావా అంటూ  చాలా దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఈ నటి ని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: