కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా మూవీ మొదట కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల అయింది కన్నడ లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ మూవీ ని ఆ తర్వాత ఇతర భాషలలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి ఇతర భాషలలో నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో కాంతారా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. కొన్ని రోజుల క్రితం నుండే ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అక్షయ్ కుమార్ "కాంతారా" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాంతార మూవీ ని చూసి చాలా నేర్చుకున్నా , రిషబ్ శెట్టి మూవీ ని తీసిన విధానం అసాధారణం అయినది. స్టోరీ టెల్లింగ్ , డైరెక్షన్ , పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ ను ఇచ్చింది. మూవీ ని తీసినందుకు మూవీ యూనిట్ కి రెస్పెక్ట్ అంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.