వాల్తేరు వీరయ్యలో శ్రీదేవి-చిరంజీవి సాంగ్..!?

Anilkumar
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు ఆ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన యాక్టింగ్ డాన్స్, ఫైట్స్, గ్రేస్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ సి ఇండస్ట్రీలో ఆయన ఫాలోయింగ్ తో మార్కెట్ ను భారీగా పెంచుకున్నాడు చిరంజీవి. ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం వలస సినిమాలు చేస్తున్నాడు. ఈయన మరి ముఖ్యంగా రీఎంట్రీలో ఫుల్ జోష్ తో కనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి. వరుసు సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నాడు. వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తూ ప్రస్తుతం తన 154వ ప్రాజెక్టుగా వాల్తేరు వీరయ్య సినిమాను చేస్తున్నాడు.

ఇక టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడు .అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యిందట. ఈ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ మరియు కొన్ని కీలకమైన పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఫారిన్లో వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన పాటల షూటింగ్ జరుగుతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే .ఇక ఇందులో చిరంజీవి శృతిహాసన్ మధ్యన సూపర్ డ్యూయెట్ పెట్టారని తెలుస్తోంది. 

ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అంటూ... కొనసాగుతుంది అని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేయగా మంచు ప్రాంతాల్లో దీన్ని షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ ని ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇది ఓ మేజర్ హైలెట్ కాబోతుంది అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ రవిశంకర్ నిర్మిస్తున్నారు .మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం తెగ చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: