ఇనాయ ఎలిమినేషన్.. ఆర్జె సూర్య షాకింగ్ రియాక్షన్?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ అలరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా రాజకీయాల నడుస్తున్నాయా? రికమండేషన్స్ ప్రకారమే ప్రస్తుతం ఎలిమినేషన్ జరుగుతున్నాయా? బిగ్బాస్ నిర్వహకులు అమ్ముడుపోయారా? అంటే ప్రస్తుతం అందరి నోటి నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే ఇలా బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం జరగడానికి వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి అని చెప్పాలి . గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే తమకి  నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే హౌస్ లో ఉంచి ఇక జనం అభిమానం ఉన్న కంటెస్టెంట్లను మాత్రం ఎలిమినేట్ చేస్తున్నారు అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి.

 గతంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న గీతూ రాయల్ ఎలిమినేట్ అయినా సమయంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల సరిగ్గా ఫైనల్ వారానికి ముందు ఇనాయ ఎలిమినేషన్ పై కూడా జనాలు మండిపడుతున్నారు. హౌస్ లో అందరికంటే మొదటి నుంచి కష్టపడుతూ గేమ్ ఆడుతూ వచ్చింది ఇనాయా. మెయిల్ కంటెస్టెంట్స్ కి సైతం ఎక్కడ తగ్గకుండా మంచి ఫైట్ ఇచ్చింది. ఇక ఈ సీజన్ చివరి వారంలో కెప్టెన్ అయి బెస్ట్ కెప్టెన్ గా కూడా అందరి చేత ప్రశంసలు అందుకుంది.

 అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ఇనాయ ఇటీవల ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ గురి చేసింది. ఇకపోతే ఇటీవల ఇనాయ ఎలిమినేషన్ పై ఆమె స్నేహితుడు ఆర్ జె సూర్య ఇంస్టాగ్రామ్ వేదిక రియాక్ట్ అయ్యాడు. ఆల్ ఓవర్ ఇండియా ట్రెండ్ అవుతున్న ఇనాయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ పోస్ట్ చేసి హిందీ న్యూస్ ఛానల్ దీని గురించి మాట్లాడుకుంటుంది అంటూ వివరించాడు. ఇక అభిమానులు కూడా ఇనాయా ఎలిమినేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. ఇక విన్నర్ కి కావాల్సిన క్రేజ్ ఇనాయ కు ఇప్పటికే వచ్చేసింది అంటూ సూర్య పోస్ట్ పెట్టడం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: