అన్ని రోజులపాటు విదేశాలకు టూర్ కు వెళ్లిన ఎన్టీఆర్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జహ్నవి కపూర్ హీరోయిన్ గ నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిబోయే మూవీ లో నటించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ స్టార్ట్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు యూఎస్ఏ కు వెళ్ళాడు. అక్కడ నెలరోజుల పాటు హాలిడే ఎంజాయ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. తిరిగి వచ్చాక జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: