సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు...!!

murali krishna
టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు సత్యదేవ్..క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సత్యదేవ్ ఆ తర్వాత హీరో గా ఎదిగి, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా ఏర్పర్చుకున్నాడు..కేవలం హీరో రోల్స్ మాత్రమే కాదు..కథ నచ్చితే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా సిద్ధం గా ఉండే నటుడు సత్యదేవ్..రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్ర కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.
చిరంజీవి కి ఈ సినిమా ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో..సత్యదేవ్ కి కూడా అంతే మంచి పేరు అయితే వచ్చింది..ఇక ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'గుర్తుందా శీతాకాలం' చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది..టీజర్ మరియు ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ..సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం తో డివైడ్ టాక్ అయితే వచ్చింది.
ఇది ఇలా ఉండగా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న సత్యదేవ్..తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు..ఆయన మాట్లాడుతూ 'ఒకసారి విమానాశ్రయం లో తన తోటి ప్రయాణికుడు పాస్ పోర్ట్ ని తన కాలులో పెట్టుకున్నాడట .అతడు పాస్ పోర్ట్ తీస్తున్న సమయం లో పోలీసులు గమనించి, అతనిని అతనితో పాటు ఉన్న నన్ను అరెస్ట్ చేసారు..ఎందుకంటే పోలీసులు మమల్ని సూసైడ్ బాంబర్స్ అనుకున్నారు..సూసైడ్ బాంబర్స్ ట్రిగ్గర్ ని మాములుగా కాలులో పెట్టుకుంటారట..ఈ విషయం అప్పట్లో నాకు తెలియదు' అంటూ కూడా చెప్పుకొచ్చాడు సత్యదేవ్.

ఇక సత్యదేవ్ కి తల మీద ఒక మచ్చ అయితే ఉంటుంది..ఆ మచ్చ గురించి ఆయన చెప్తూ 'చిన్నప్పటి నుండి నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమానిని..ఒకరోజు 'కొదమ సింహం' సినిమా చూసి అందులోని ఫైట్ సీన్ నేర్చుకోడానికి ప్రయత్నం కూడా చేశాను..ఆ క్రమం లో నా తలకి దెబ్బ తగిలింది..ఆ తర్వాత అది మానిపొయ్యాక మచ్చగా మారిపోయింది' అంటూ చెప్పుకొచ్చాడట సత్యదేవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: