మహేష్ బృందానికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన నమ్రత....!!

murali krishna
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం షూటింగ్‌ లో బిజీ గా ఉన్నారు. ఇటీవల కృష్ణ మరణం తర్వాత తొలిసారి త్రివిక్రమ్ సినిమా లో నటి స్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికం గా ఎస్ఎస్ఎం బీ28 టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ముంబై లో చిత్రీకరణ జరుపు కుంటోంది. ఈ సందర్భం గా మహేశ్ సతీమణి నమ్రత ముంబయి లో ఆమె స్నేహితురాలు సాజియా ను  కలుసు కున్నారు. వారి ఇంట్లోనే మహేశ్‌ బాబు, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, డైరెక్టర్ త్రివిక్రమ్‌ తో కలిసి రుచి కరమైన ఇంటి వంటకాల ను ఆస్వా దించారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో పంచు కున్నారు.
తన స్నేహి తురాలు ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటో లను నమ్రత తన ఇన్‌స్టా లో షేర్ చేశారు. ఇన్‌స్టా లో ఆమె రాస్తూ..' నా కలల జీవితం లో కొన్ని మధుర క్షణాలు.. ఇంటి భోజనాన్ని రుచి చూపించిన సాజియా కు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది.  ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కని పించనుంది. గతం లో ఆమె మహర్షి చిత్రం లో కలిసి పని చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం లో నటించనున్నారు. ఆ చిత్రాని కి ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ ఖరారు చేశారు. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ..'ఈ చిత్రం గురించి మాట్లాడటం చాలా సంతోషం గా ఉంది. ఇప్పుడు నా కల నిజమైంది. రాజమౌళి తో నేను చాలా కాలం గా కలిసి పనిచేయడాని కి ప్రయత్నిస్తున్నా. చివర కు అది నెర వేరబోతోంది. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైట్‌ గా ఉన్నా' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: