హరీష్ శంకర్ కు విజ్ఞప్తి చేసిన జీవిత....!!

murali krishna
చిత్ర పరిశ్రమలో చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారని, వారికి అవ కాశం ఇచ్చి ప్రోత్సహించాలని నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్‌.దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కు విజ్ఞప్తి చేశారు. 'పంచతంత్రం'  ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేదికపై ఆమె మాట్లా డారు. తన తనయ శివాత్మిక, స్వాతి, దివ్య శ్రీపాద, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భం గా నిర్వహించిన వేడుక కు హరీశ్‌, జీవిత అతిథు లుగా హాజర య్యారు.
జీవిత మాట్లా డుతూ.. ''నా చిత్ర బృందం నా కుటుంబం లాంటిది. ఐదు కథల సంకలనం గా రూపొందిన ఈ సినిమా అందరి కీ కనెక్ట్‌ అవు తుంది''అని అన్నారు. వేడుక కు విచ్చేసినందుకు హరీశ్‌ శంకర్‌ కు కృతజ్ఞతలు తెలి పారు. ఆ చిత్రంలో ఐదుగురు తెలుగు అమ్మాయిలు నటించా రని, అలాంటి వారిని ప్రోత్సహించాలని (నవ్వుతూ..) హరీశ్‌ ను కోరారు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. ''ఓ రచయిత గా నేను తెలుగు వారినే ఎంపిక చేసేం దుకు ఇష్టపడతా. అప్పుడప్పుడు నేను ఫస్ట్‌ టేక్‌, రెండో టేక్‌ కు సంభాషణ మారు స్తుంటా. అలా చేస్తే ముంబయి నుంచి వచ్చిన వారు ప్రాక్టీస్‌ అయ్యేం దుకు సమయం కావాలంటారు. అందుకే సెట్‌లో మొత్తం తెలుగు వారు ఉండాల నుకుంటా. కానీ, కొన్ని పరిస్థితుల వల్ల మనవారి కి న్యాయం చేయలేకపోతున్నా. ఆ విషయం లో నన్ను క్షమించాలి'' అని హరీశ్‌ అన్నారు. 'గద్దలకొండ గణేశ్‌' సినిమా లో తెలుగు అమ్మాయి అయిన డింపుల్‌ హయాతీకి ఓ పాటలో అవకాశం ఇచ్చానని, ఆమెకు ఇప్పుడు మంచి అవకా శాలు వస్తున్నాయని ఈ సందర్భం గా తెలిపారు. 'పంచతంత్రం' పెద్ద కంటెంట్‌ ఉన్న సినిమా అని, టైటిల్‌ పెట్టడం లోనే దర్శకుడు హర్ష సగం విజయం సాధించార ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: