వారాహి పై ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కు తెలుగు సాహిత్యం పై అదేవిధంగా తెలుగు భాష పై మంచి పట్టు ఉంది అని అంటారు. ఆమాటలకు అనుగుణంగానే పవన్ తన ‘జనసేన’ పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలకు మంచిమంచి పేర్లు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో 18 నెలలలో ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న ఎన్నికలకు సిద్ధం కావడానికి పవన్ ప్రచార రధానికి పెట్టుకున్న పేరు ‘వారాహి’ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
 
 అత్యంత ఖరీదైన సౌకర్యాలతో అధునాతనంగా పవన్ స్వయంగా దగ్గర ఉండి డిజైన్ చేయించుకున్న ఈవ్యాన్ రాజకీయ వర్గాలలోనే కాకుండా పవన్ అభిమానులలో కూడ ఆసక్తికర చర్చలకు అవకాశాన్ని ఇస్తోంది. వాస్తవానికి పవన్ గత సంవత్సరం విజయదశమి నుండి ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తాడని మొదట్లో లీకులు వచ్చాయి.
 
 అయితే ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉంది కాబట్టి ముందుగానే ప్రజలలోకి వెళ్లిపోయి ప్రచారం చేసిన ఆప్రచారాన్ని ఎన్నికల సమయానికి మర్చిపోయే ఆస్కారం ఉంది అని భావించిన పవన్ తన బస్సు యాత్రను వచ్చే ఏడాది సమ్మర్ నుండి ప్రారంభించాలని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని అంటారు. ‘వారాహి’ అంటే దుర్గాదేవి పర్యాయ పదాలలో ఒక పేరు అని చెపుతూ ఉంటారు. పవన్ తన వాహనానికి ఇలా ‘వారాహి’ అని పేరు పెట్టడం వెనుక ఒక అర్థం ఉంది అని అంటారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు వారాహి ఒకరు అని దేవీ పురాణం చెపుతోంది.
 
 ఆ వారాహి అమ్మవారు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు అని అంటారు. ఈపేరుతో పవన్ ఏర్పాటు చేసుకున్న ఈ వ్యాన్ ఎవరితో యుద్ధం చేయడానికి అంటూ అప్పుడే సోషల్ మీడియాలో పవన్ వ్యాన్ పై కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ తన ప్రత్యర్థుల చేత విపరీతమైన విమర్శలు ఎదుర్కుంటున్న పవన్ కు ఈవారాహి వ్యాన్ లో ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ మాత అనుగ్రహంతో సకల శక్తుల ఆశీస్సులు ఉంటాయని అతడి అభిమానులు ఆశిస్తున్నారు..    
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: