పవన్ కోసం త్యాగాలు చేస్తున్న నిర్మాతలు !

Seetha Sailaja

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడం చాల ఆలస్యం అవుతున్నప్పటికీ పవన్ తో సినిమాలు తీయడానికి ఆశక్తి కనపరుస్తున్న నిర్మాతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది కానీ తరగడం లేదు. లేటెస్ట్ గా సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించడానికి ఒప్పుకున్న ఒక మాఫియా కథకు సంబంధించిన మూవీ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం ఈమూవీలో పవన్ కనిపించేది కేవలం 30 నిముషాలు మాత్రమే అని అంటున్నారు. అయితే కథ అంతా పవన్ చుట్టూ తిరుగుతుందని టాక్. అంతేకాదు ఈమూవీలో మాఫియా డాన్ గా కనిపించే పవన్ కు హీరోయిన్ ఉండదట. ఇక ఈమూవీని పవన్ బ్రేక్ లేకుండా పూర్తి చేయడానికి ఒక భారీ సెట్ ను విజయవాడ దగ్గరలోని అమరావతి ప్రాంతంలో వేసి అక్కడ షూటింగ్ కొనసాగిస్తూ మరొక వైపు పవన్ రాజకీయ కార్యకలాపాలకు ఎటువంటి అడ్డూ లేకుండా ప్లాన్ చేసారట.

ఇక త్రివిక్రమ్ రచన అందించి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘వినోదయ శీతం’ మూవీలో పవన్ కనిపించేది కేవలం 20 నిముషాలు మాత్రమే అంటున్నారు. 30 రోజులలో పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తామని పవన్ ఎప్పుడు అవసరం అనుకుంటే అక్కడకు వెళ్ళడానికి చార్టెడ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేస్తామని కేవలం పవన్ ఈమూవీ షూటింగ్ కు ఓకె చెపితే చాలు అని ఈమూవీ నిర్మాతలు అంటున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మించవలసిన మూవీ షయంలో కూడ పవన్ ఎలా కోరితే అలా కథలో మార్పులు చేస్తామని నిర్మాతలు చెపుతున్నట్లు టాక్.

జరుగుతున్న ఈపరిణామాలకు సంబంధించిన వార్తలు చూస్తుంటే పవన్ తాను ఒప్పుకున్న సినిమాలో నటిస్తే చాలు ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు అన్న అభిప్రాయంలో పవన్ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను బట్టి సినిమా హిట్ ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా పెరిగిపోతున్న పవన్ మ్యానియా ఎలా ఉందో అర్థం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: