"చంద్రముఖి 2" మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా రనోత్..!

Pulgam Srinivas
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ఆ మూవీ లతో ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇప్పటికి కూడా హిందీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం కంగనా రనౌత్ తెలుగు లో ఏక్ నిరంజన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఇలా ఉంటే కంగనా రనోత్ ఈ మధ్య వరుస మూవీ లతో కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది.

అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల సూపర్ హిట్ విజయం అందుకున్న చంద్రముఖి మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న చంద్రముఖి 2 మూవీ లో ఈ ముద్దు గుమ్మ కు అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ "చంద్రముఖి 2" మూవీ గురించి మాట్లాడుతూ ...  చంద్రముఖి 2 మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా అని , చంద్రముఖి 2 మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని తెలియజేసింది. ఇది ఇలా ఉంటే చంద్రముఖి 2 మూవీ లో రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తూ ఉండగా , పి. వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: