నేను ఆ నటుడిని ప్రేమించడానికి కుక్కపిల్లే కారణం... నాని హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి హరి ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తకిట తకిట అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన పిల్ల జమిందార్ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం తో , ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. పిల్ల జమిందార్ మూవీ తో సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మాత్రం పిల్ల జమిందార్ మూవీ రేంజ్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించు కోలేక పోయింది.

ఈ ముద్దు గుమ్మ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే హరి ప్రియ తన కో స్టార్ అయినటు వంటి వశిష్ట సింహ తో ప్రేమలో పడిన విషయం మన అందరికీ తెలిసింది. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తాను వశిష్ట సింహ తో ప్రేమలో పడడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది. నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండగా ఒకటి చనిపోయింది అని  , వశిష్ట సింహ మరొక కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు అని తెలిపింది. అలా మా ఇద్దరి మధ్య ప్రేమకు ఆ కుక్క పిల్ల కారణం అయింది అని హరి ప్రియ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: