ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పాలి. ఊరు పేరు కూడా లేకుండా జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన వారికి ఇప్పుడు ఇల్లు కార్లు కొనుక్కునే స్టేజ్ను అందించింది జబర్దస్త్ .అనంతరం మంచి పేరు తెచ్చుకొని బయటకు కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇక అలా మొదటి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో ఆయనతో పాటుగా చమ్మక్ చంద్ర కూడా వెళ్లిపోవడం జరిగింది. అయితే ఆయన అనంతరం ఆయన స్కిట్ లలో నటించే సత్య శ్రీ కూడా వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం
చమ్మక్ చంద్ర బిజీ గా ఉండడంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టడం లేదు. అయితే జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిపోయిన అనంతరం ఈమెకి అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత వారమే సత్య శ్రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. స్కిట్ అనంతరం ఆమె బాగా ఎమోషనల్ అవుతూ ఏం జరిగిందో అంతా చెప్పుకొచ్చింది. జబర్దస్త్ స్టేజ్ ని నేను చాలా మిస్ అయ్యాను వీళ్ళందరూ నా కుటుంబం మళ్లీ జబర్దస్త్ కి తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడికి వెళ్లినా కూడా సత్య శ్రీ అని కాదు జబర్దస్త్ సత్య అని పిలుస్తున్నారు.
అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటినుండి జబర్దస్త్ లో అసలు తగ్గేదేలే అంటూ ఎమోషనల్ అయింది సత్య శ్రీ. ఇదిలా ఉంటే తాజాగా ఈమె జబర్దస్త్ లో చేసిన ఒక స్కిట్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన స్టేజ్ ఇదే మళ్లీ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది .ఇకనుండి ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తాను అని మల్లెమాల టీం మొత్తానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది సత్య. ఇక ఆ పోస్టులో భాగంగా సత్య రోహిణి టాగ్ చేయడంతో ఇదంతా రోహిణి చేయించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి .అయితే రోహిణి మళ్లీ సత్యకు జబర్దస్త్ లోకి తిరిగి వచ్చే అవకాశాన్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చాలామంది అప్పుడు వెళ్లిపోవడం ఎందుకు మళ్లీ సిగ్గు లేకుండా తిరిగి రావడం ఎందుకు అంటూ అసభ్యకరమైన కామెంట్లు కూడా చేయడం జరుగుతుంది..!!