ఘట్టమనేని అసలు వారసుడు ఎవరు.. మళ్ళీ మొదలైన గొడవలు..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈ మధ్యనే కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న విషయాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు కొడుకు మహేష్ బాబు కూడా ఆ బాధ నుండి ఇంకా బయటకు రాలేదని తెలుస్తోంది .ఇక మహేష్ బాబు తండ్రి మరణించే మూడు నెలల ముందే ఆయన తల్లి ఇందిరా దేవి మరణించారు .మూడు నెలల వీధిలోని తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు మహేష్ బాబు .ఆ విషయం నుండి మహేష్ బాబు ఇంకా కోలుకోలేదు. 

అయితే ఆయన  నమ్ముకున్న సినిమాలు లాస్ అవ్వకూడదని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తిరిగి  సినిమా సెకండ్ షెడ్యూల్ ను ఎనిమిదవ తేదీ నుండి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోని ఘట్టమనేని కుటుంబంలో కొత్త గొడవ మళ్ళీ మొదలైందని వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. మొదటి నుండి ఘట్టమనేని కుటుంబంలో అసలు వారసుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయితే కొందరు మహేష్ బాబు అని అనగా కొందరు మాత్రం నరేష్ అంటూ చెబుతూ ఉంటారు.

 సూపర్ స్టార్ కృష్ణ మరణించిన అనంతరం ఘట్టమనేని బాధ్యతలు తీసుకుని అర్హత మహేష్ బాబుకి ఉంది అంటూ అనేకమైన వార్తలు వచ్చాయి .ఈ క్రమంలోనే నరేష్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఆయనే బాధ్యతలను నిర్వహించాలి అంటూ వార్తలు వస్తున్నాయి .ఇంటికి పెద్ద కొడుకుగా నరేష్ ఉండగా మహేష్ బాబు ఎలా బాధ్యతలు తీసుకుంటాడు అని ...మహేష్ ఫ్యామిలీ అసలైన మొదటి వారసులు అని ఆ తర్వాతే నరేష్ అని కొందరు చెబుతున్నారు .అయితే ఈ క్రమంలోని ఘట్టమనేని అసలైన వారసుడు ఎవరు అని చర్చించుకుంటున్నారు. అయితే ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ మరణం అనంతరం ఘట్టమనేని కుటుంబంలో గొడవలు ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: