ఆషు మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవి..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమాతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ సినిమాతో సూపర్ గా గుర్తింపు ను తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ అనేక బాలీవుడ్ మూవీ లకు దర్శకత్వం వహించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో  కూడా ఎక్కువ శాతం విజయాలను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.
 

ఇలా అలనాటి కాలంలో ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించిన  రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ ఈ దర్శకుడి కి విజయం మాత్రం లభించడం లేదు. ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలకు దర్శకత్వం వహించడం తో పాటు ఈ మధ్య హాట్ బ్యూటీ లతో బోల్డ్ ఇంటర్వ్యూ లను కూడా నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే హాట్ బ్యూటీ ఆశు రెడ్డి తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ను రామ్ గోపాల్ వర్మ నిర్వహించాడు. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో ఇంటర్వ్యూ ను కూడా రామ్ గోపాల్ వర్మ , ఆశు రెడ్డి తో నిర్వహించాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ను రామ్ గోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకున్నాడు. మరి ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: