పెద్ద ప్లాన్ వేసిన అల్లు అర్జున్...!!

murali krishna
అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కి గత సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ కూడా తెలిసిందే.
ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతోందని సమాచారం. ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత పుష్ప రష్యన్ లాంగ్వేజ్ రిలీజ్ కోసం రష్యా కి చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా వెళ్లారు. అక్కడ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే వారం ఇండియా కు తిరిగి వచ్చి వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా హీరోయిన్ రష్మిక మందాన కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టుగా సమాచారం కూడా అందుతుంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనే విషయం లో ఒక క్లారిటీ అయితే లేదు.
కానీ సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త పద్ధతి ని అల్లు అర్జున్ ఫాలో అవ్వబోతున్నట్లుగా సమాచారం.. కేవలం పాతిక కోట్ల రూపాయల పారితోషకం తీసుకుని ఆ తర్వాత సినిమా కి వచ్చే కలెక్షన్స్ జరిగే బిజినెస్ మరియు లాభాలు ఇలా అన్నింటిని బేరీజ్ వేసుకుని వాటా తీసుకోబోతున్నాడని తెలుస్తుంది.. సినిమా నష్టపోయినా కూడా అల్లు అర్జున్ కి మరో 30 నుండి 35 కోట్ల రూపాయలు వచ్చే విధంగా డీల్ అయితే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు బాలీవుడ్ హీరోలు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు, వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 కూడా అదే స్థాయిలో ఉంటే బన్నీ మరియు సుకుమార్ లు పాన్ ఇండియా స్టార్ లు అయ్యే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: