ఆ స్టార్ హీరోకి కాల్ చేసి మరీ మీ సినిమాలో చేస్తా అని చెప్పిన జాన్వీ కపూర్.. ఎవరో తెలుసా..!?

Anilkumar
అతిలోకసుందరి దిగవంత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మంచి క్రీస్ ను సంపాదించుకుంది.మంచి పాత్రలు  ఎంచుకుంటూ నటనపరంగా తానేంటో నిరూపించుకుంటుంది .అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది అతిలోకసుందరి దిగవంత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటనపై సినీ విమర్శలు సైతం ప్రశంసలు కురిపించారు . ఇప్పుడు ఈమె సౌత్ లో చిత్రాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజాగా మిలి ప్రమోషన్ లో భాగంగా తనకు దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉందని అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో ఖచ్చితంగా నటిస్తానని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తాను పెద్ద ఫ్యాన్ అని ఆయన నటించిన ఓ సినిమాతో ఆయనకి వీరాభిమాని అయిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. విజయ్ సేతుపతి తో కలిసి నటించినందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఈమె  ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అనంతరంఈమె  విజయ్ ఫోన్ చేసిన ఒక సంఘటన గుర్తు చేయడం జరిగిందట. నేను విజయ్ సర్ కు  పెద్ద అభిమానిని ఆయన నటించిన నాను రౌడీ చిత్రాన్ని వందసార్లు చూసి ఉంటాను .ఆయన నంబర్ కనుక్కొని కాల్ కూడా చేశాను. నేను మీకు పెద్ద అభిమాని సార్ మీరు చేసే నెక్స్ట్ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగిందట. ఆడిషన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి విజయసేతుపతి స్పందన ఏంటి అని అడగ్గా ...కేవలం తను అయ్యో ...అయ్యో అంటూనే ఉన్నాడని.. ఆయన బాధపడ్డాడేమో లేదా సిగ్గుపడ్డాడో ఆమెకు అర్థం కాలేదని విజయ్ రియాక్షన్ చూసి ఆమె ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. దీంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎంతో పవర్ఫుల్గా జోష్ గా కనిపిస్తారని ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: