"ఖుషి" మూవీలో అలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఉప్పెన మూవీ తర్వాత  శ్యామ్ సింగరాయ్ ,  బంగార్రాజు మూవీ లతో వరస విజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ది వారియర్ ,  మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లతో వరసగా అపజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇలా వరుస అపజయాలు ఈ ముద్దు గుమ్మ కు ఎదురైనప్పటికీ కృతి శెట్టి కి సినిమా అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కృతి శెట్టి , నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న కస్టడీ అనే మూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి శెట్టి మరో క్రేజీ మూవీ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వం లో ఖుషి అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ క్రేజీ మూవీ లో కృతి శెట్టి కి చాన్స్ దక్కినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కృతి శెట్టి ఈ మూవీ లో సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు , అలాగే ఈ మూవీ లో కృతి శెట్టి కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: