ఆ సినిమాకు డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోతున్న పూజా హెగ్డే..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ గార్జియస్ నటీమలలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో తెలుగు , తమిళ , హిందీ మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. అలాగే ఇప్పటికే ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాదే శ్యామ్ , ఆచార్య వంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీ లలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే , తమిళ్  బీస్ట్ అనే మూవీ లో హీరోయిన్ గా కూడా నటించింది. బీస్ట్ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల అయింది. ప్రస్తుతం పూజ హెగ్డే వరస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి  మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో  జాయిన్ కావాల్సి ఉంది. కాకపోతే పూజ హెగ్డే ప్రస్తుతం ఈ మూవీ కి డేట్ లను అడ్జస్ట్ చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. దానితో ఈ మూవీ షూటింగ్ లో పూజా హెగ్డే ఇంకొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , పూజ హెగ్డే కాంబినేషన్ లో మహర్షి మూవీ తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: