"హిట్ 2" తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ బ్యూటీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈచట వాహనములు నిలుపరాదు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి అనే భారీ యాక్షన్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన అందచందాలను కూడా ఆరబోయడానికి ఏbమాత్రం వెనకడుగు వేయలేదు.

అలాగే తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును ఈ ముద్దుగుమ్మ ఖిలాడి మూవీ తో మెప్పించింది. ఖిలాడి మూవీ లో మీనాక్షి చౌదరి తన అందచందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించినప్పటికీ , ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేదు. ఇలా మీనాక్షి చౌదరి తన కెరియర్ లో నటించిన రెండు తెలుగు మూవీ లతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేక పోయింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణం లో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీకి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇలా ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ విజయాన్ని మరియు ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: