టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈమె రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ప్రేమతపస్సు సినిమాతో పరిచయమై ..మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.. అనంతరం స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది..అంతేకాదు అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..అనంతరం ఈమె డైరెక్టర్ సెల్వమని ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. తర్వాత కొన్ని సినిమాల్లో చేసి బ్రేక్ తీసుకోవడం జరిగింది.. అనంతరం ఈమె తల్లి..
అత్త పాత్రల్లో నటించి మెప్పించింది...అంతేకాదు అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో జడ్జిగా చాలా సంవత్సరాలు చేసింది రోజా. అయితే నటి రోజా కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాదు ప్రస్తుతం రోజా వైసిపి పార్టీలో మంత్రి గా కొనసాగుతోంది.ఇక రాజకీయాల కోసం రోజా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వడం మనకి తెలిసిన విషయమే..ఇకపోతే ఈమె మళ్ళీ సినీ ఇండస్ట్రీలో కి వచ్చే అవకాశం ఉంది అనే చెప్పొచ్చు.. అయితే సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల పాత్రల్లో నటించిన రోజా ఒక సినిమాలో నటించాలని ఉందట..
అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క నటించిన అరుంధతి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అయితే రోజాకి కూడా ఇలాంటి సినిమాలో నటించాలని ఉందట.. ఇకపోతే ఈమెకి ఇంత వయసు వచ్చిన కూడా ఆ కోరిక మాత్రం ఇంకా తెరలేదని అనుకుంటుందట...ఇక కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అరుంధతి సినిమా నటిగా అనుష్కకి అలాగే డైరెక్టర్గా కోడి రామకృష్ణ కి కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఇక ఈ వయసులో రోజా కోరిక తీరడం కష్టమే అంటున్నారు నెటిజన్లు.. చూడాలి మరి ఈమె కోరిక నెరవేరుతుందో లేదో..!!