సీనియర్ నటి లక్ష్మి తల్లి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే....!!

murali krishna
సినిమా అంటేనే రంగుల ప్రపంచం మాత్రమే కాదు మాయా ప్రపంచం కూడా.. ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెడుతుందో చెప్పడం అసాధ్యం.. నిజానికి సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ఒకసారి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఎటువంటి సెలబ్రిటీలైనా సరే తమ జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా సరే అది హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది.
అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కెమెరా వారిని చూస్తూనే ఉంటుంది కాబట్టి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు.అందుకే సినీ సెలబ్రిటీలు చాలామంది తమ పర్సనల్ లైఫ్ లో స్వేచ్ఛను కోల్పోతారని చెప్పవచ్చు. ఇలా అప్పట్లో తన పర్సనల్ లైఫ్ తో సంచలనంగా మారింది నటి లక్ష్మి. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె 1975లో జూలీ అనే బాలీవుడ్ సినిమాలో నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అలా 15 ఏళ్ల వయసు నుంచి నటిస్తూ వస్తున్న లక్ష్మి ఇప్పటివరకు 400కు పైగా సినిమాలలో నటించింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లక్ష్మీ మూడు పెళ్లిళ్లతో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా లక్ష్మీ తండ్రి నెల్లూరు జిల్లాకు చెందిన వైవి రావు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సాంఘిక నేపథ్య సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించారు.

లక్ష్మీ తల్లి రుక్మిణి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించింది. దాదాపు 100 సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందిన ఈమె మూడు సంవత్సరాల వయసులో బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. 40 సినిమాలలో బాలనటిగా నటించింది . అలా తెలుగు , తమిళ్, కన్నడ సినిమాలలో నటించి మెప్పించిన శ్రీ లక్ష్మీ తల్లి రుక్మిణి.. శ్రీవల్లి అనే సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. ప్రస్తుతం లక్ష్మీ తల్లి రుక్మిణి కూడా హీరోయిన్ అని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: