జబర్దస్త్ కొత్త యాంకర్ 8 వారాలకు మాత్రమే.. మరి తర్వాత ఎవరు..!?

Anilkumar
ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ  కార్యక్రమం దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో యాంకర్స్ గా అనసూయ మరియు రష్మీ గౌతమ్ మాత్రమే వ్యవహరించారు.ఇకపోతే అనసూయ మధ్యలో కొన్నాళ్లు కనిపించకుండా పోయినా ఆ సమయంలో రష్మి గౌతమ్ సందడి చేసింది. అయితే తాజాగా అనసూయ మళ్లీ కనిపించకుండా పోయింది.8కె  సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను చేయలేక పోతున్నాను అంటూ చెప్పేసి మల్లెమాల కి మరియు

 ఈటీవీ జబర్దస్త్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పేసింది.కాగా అనసూయ లేని లోటును రష్మి గౌతమ్ మళ్లీ పూడ్చే ప్రయత్నం చేసింది.అయితే  రష్మి గౌతమ్ ఎప్పటిలాగే జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ అని కూడా మేనేజ్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ సమయంలో కన్నడ నటి సౌమ్య రావు ని తీసుకొచ్చారు. కాగా ఆమె అనసూయ కి ఏ మాత్రం తగ్గకుండా అందాలను చూపించడంతో పాటు చలాకీగా యాంకరింగ్ చేస్తూ దూసుకు పోతుంది.అయితే  ఖచ్చితంగా జబర్దస్త్ యొక్క భవిష్యత్తు ఎపిసోడ్స్ అన్నీ కూడా సౌమ్య చేయబోతున్నట్లుగా అంత భావించారు.

ఇక మల్లెమాల వారు చెబుతున్న దాని ప్రకారం కేవలం 8 వారాలు మాత్రమే సౌమ్య జబర్దస్త్ యొక్క యాంకర్ గా వ్యవహరించబోతుంది.అయితే  సౌమ్యతో మల్లెమాల వారు కేవలం ఎనిమిది వారాలకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇక ఆ తర్వాత ఆమెకు ప్రేక్షకుల నుండి మద్దతు లభించి.. మల్లెమాల వారి యొక్క ప్రశంసలు దక్కించుకుంటే అప్పుడు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆమెకు పాజిటివ్ టాక్ దక్కింది, కనుక 8 వారాల తర్వాత ఆమెను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతే కాకుండా  ఇక ఆమె కు పారితోషికం కూడా పెంచే అవకాశాలు ఉన్నాయట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: