స్టార్ హీరో భార్యకి కూడా తప్పని లైంగిక వేధింపులు..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీ అంటేనే హీరోయిన్లు ఎన్నో ఇబ్బందులను.. లైంగిక వేధింపులను.. ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇక  ముఖ్యంగా హీరోయిన్లు దర్శక నిర్మాతల మనోభావాలను కించపరచకుండా వారి ఇష్టానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. ఇకపోతే దర్శక నిర్మాతలకు ఎదురు తిరిగితే మాత్రం ఇక వారి కెరియర్ అయిపోయినట్టే. అందుకే  ఇక చాలామంది దర్శక నిర్మాతలు చెప్పిన మాటలను కాదనకుండా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం మనసు చంపుకొని మరి కొన్ని సీన్లలో నటిస్తూ ఉంటారు. కొంతమంది ఎదిరించి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి అనుభవాలే సాధారణ సెలబ్రిటీలకు మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ కన్నా.. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె మాట్లాడుతూ ఒక డైరెక్టర్ తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించారని వెల్లడించారు ట్వింకిల్ కన్నా..అయితే ఒకరోజు షూటింగ్ లొకేషన్లో ఉండగా ఆ సినిమా దర్శకుడు హీరో, హీరోయిన్ల మధ్య ఒక వాన సాంగ్ షూట్ చేయాల్సి ఉంది . ఇక ఇందుకోసం ఈమె తెలుపు రంగు దుస్తులు ధరించిందట.

ఆ సమయంలో డైరెక్టర్ ఆమె వద్దకు వెళ్లి తనకు శాలువా కప్పి నేను ఇప్పుడు మందాకిని పాత్ర చేయమంటే నువ్వేం చేస్తావని అడగ్గా.. ఆమె నో అని చెప్పింది అంట. ఇక ఆ తర్వాత నువ్వు రాజు కపూర్ వి కాదు అంటూ సమాధానం చెబుతానని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.గతంలో రాజ్ కపూర్ దర్శకత్వంలో రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో నటించిన హీరోయిన్ మందాకిని ఈ సినిమాలో బిడ్డకు పాలు ఇచ్చే సన్నివేశాలలోనూ అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించే విధంగా పలుచని చీరలో స్నానం చేస్తూ సందడి చేశారు. ఇక ఇలా మందాకిని తరహాలో తాను కూడా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా దుస్తులు వేసుకోమని పరోక్షంగా హింసించాడట డైరెక్టర్.. నో చెప్పడంతో .. అతను మారు మాట్లాడకుండా ఆమెకు బదులు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారని సమాచారం . ఇక అలా అతడి చేతిలో దారుణంగా హింసించబడ్డాను అని ట్వింకిల్ కన్నా వెల్లడించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: