క్యార్వాన్ కల్చర్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ఒకప్పుడు టాప్ హీరోలు హీరోయిన్స్ చాల ఖరీదైన విలాసవంతమైన కార్లు కొనుక్కోవడం అందరి దృష్టిని ఆకర్షించేది. అయితే గత 10 సంవత్సరాలుగా హీరోలు హీరోయిన్స్ ఖరీదైన కార్లతో పాటు అత్యంత విలాసవంతమైన క్యారవాన్ లు కొనడం కూడ ఒక అలవాటుగా మార్చుకున్నారు.


ఆ క్యారవాన్ లు ఒక రెస్ట్ రూమ్ ఒక ఆఫీసు రూమ్ బాత్ రూమ్ లతో పాటు ఖరీదైన టివిలు కంప్యూటర్లు కూర్చోవడానికి సౌకర్యవంతమైన కుర్చీలతో ఒక చిన్న ఇల్లును పోలి ఉంటుంది. ఇప్పుడు ఈ కల్చర్ స్టేటస్ సింబల్ గా మారడంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడ సొంతంగా క్యారవాన్ లు కొనుక్కుంటున్నారు.


ఇప్పుడు పెరిగిపోయిన ఈ కల్చర్ పై దిల్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఒకప్పుడు చిరంజీవి కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు లు సినిమా సెట్ లోకి వస్తే అందరితోను మాట్లాడుతూ అభిమానం చూపించేవారని అయితే ఇప్పటి యంగ్ హీరోలు ఎవరితోనూ మాట్లాడారని వారి పని పారు చూసుకుంటూ వీలైనంత తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నారని కామెంట్ చేసాడు.


దీనికితోడు షూటింగ్ లో బ్రేక్ వస్తే చాలు వెంటనే తమ క్యారవాన్ లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటారని షాట్ రెడీ అయింది అని వారికి చెప్పడానికి వారి సహాయకులకు చెప్పాలని ఆ సహాయకులు హీరోలు హీరోయిన్స్ క్యార్వాన్ దగ్గరకు వెళ్ళి వారిని పిలిచి వారు వచ్చాక ఆ సీన్ మూడ్ లోకి రావడానికి కనీసం గంట సమయం వృధా అవుతోందని కామెంట్స్ చేసాడు. అయితే ఏ నిర్మాత ఈవిషయాన్ని వారితో ధైర్యంగా చెప్పలేని పరిస్థితి అంటూ ప్రస్తుతం సినిమాలు తీయడం కంటే ఆ డబ్బుతో రియలెస్టేట్ షేర్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నారు అంటు దిల్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: