డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ చిత్రం లో హీరో అతడే..!!

murali krishna
నాందమూరి హీరో కల్యాణ్ రామ్‌ హీరోగా 'పటాస్' సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన అనిల్ రావిపూడి మన అందరికి తెలిసినా వారే.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుసగా 'సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2' వంటి హిట్లతో ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు ఈ యువ దర్శకుడు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్.. తాజాగా 'ఎఫ్3'తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో 'అన్‌స్టాపబుల్' షో ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించుకున్న బాలయ్యతో తదుపరి సినిమా చేయబోతున్నాడు.
ఇక వీరిద్దరి కాంబినేషన్ కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే, తాజా ఇంటర్వ్యూలో బాలయ్యతో సినిమా గురించిన ఒక అప్‌డేట్స్ ఇలా పంచుకున్నాడు అనిల్. కథ చాలా బాగా వచ్చిందన్న స్టార్ డైరెక్టర్.. ఫైనల్ స్క్రిప్ట్ పట్ల సంతోషంగా ఉన్నామని తెలిపాడు.
'బాలయ్యతో సినిమా అంటే అభిమానుల అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఆయన లాంటి సూపర్ పవర్‌తో ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజం. ఇదొక ప్రత్యేకమైన కాంబినేషన్, సినిమా కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది'అన్నారు. అలాగే ఆయనతో ప్రాజెక్ట్ పట్ల తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని అనిల్ పేర్కొన్నాడు.
చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగినందున తన బాడీ లాంగ్వేజ్‌కు ఏది సూట్ అవుతుంది.. ఏది కాదో పర్‌ఫెక్ట్‌గా  నేను ఎనలైజ్ చేయగలనని చెప్పాడు. పైగా కథలోని బీట్స్ నచ్చితేనే బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ ఓకే చేస్తాడు కాబట్టి, ఆయన్ని మెప్పించాలంటే కథను  చాలా జాగ్రత్తగా సిద్ధం చేయాల్సి ఉంటుందన్నాడు అయన పేర్కొన్నారు. అంతేకాదు కథకు ఆయన ఆమోదం తెలిపితే ఇక సగం సినిమా పూర్తయినట్లే అని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అనిల్, తన విజయ రహస్యం ఏంటో ఈ సందర్భంగా చెప్పేశాడు మరీ. తన సినిమా ఏదైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో థియేటర్‌లో చూడగానే అందులో చేసిన తప్పులన్నీ అర్థమవుతాయని, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ట్రైన్ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్‌ ట్రాక్‌ను షూటింగ్‌ టైమ్‌లో  బాగా ఎంజాయ్‌ చేసినప్పటికీ థియేటర్‌లో చూస్తుంటే మాత్రం లెంగ్త్ ఎక్కువైనట్లు అనిపించిందన్నాడు. ఆ సింగిల్ ట్రాక్.. మొత్తం ఎపిసోడ్‌పై ఎఫెక్ట్ చూపిందని  అయన వెల్లడించాడు. సినిమా హిట్ అయినప్పటికీ అందులో చేసిన తప్పులను గుర్తించి, తదుపరి చిత్రంలో వాటిని రిపీట్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. మరి బాలయ్యతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: