"మట్టి కుస్తీ" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ఆ టాలీవుడ్ హీరో..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ ఇప్పటికే రవితేజ సమర్పణలో విడుదల అయిన ఎఫ్ ఐ ఆర్ మూవీ తో తెలుగు సినీ ప్రేక్షకులను కూడా పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఎఫ్ ఐ ఆర్ మూవీ తెలుగు ప్రేక్షకులను పలవాలేదు అని రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విష్ణు విశాల్ తాజాగా మట్టి కుస్తీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని తెలుగు ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
 

ఇది ఇలా ఉంటే మట్టి కుస్తీ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ మూవీ రిలీజ్ ఈవెంట్ ను రేపు సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ , హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ  ప్రీ ఈవెంట్ కు టాలీవుడ్ మాస్  మహారాజ రవితేజ ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మట్టి కుష్టి మూవీ తో విష్ణు విశాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి గుర్తింపు ను దక్కించుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: