పటాస్ అనే షో తో బుల్లితెరకు పరిచయమైన యాంకర్ శ్రీముఖి అంటే అందరికీ సుపరిచితమే.ఇక పటాస్ షోలో యాంకర్ రవితో కలిసి ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు.అయితే ఆ షో ద్వారా ఒకసారి గా ఫేమస్ అయ్యి స్టార్ యాంకర్ గా మారింది. ఇక కేవలం యాంకర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఫిమేల్ యాంకర్లలో సుమా టాప్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత ప్లేస్ ఎవరిది అంటే ఎక్కువగా శ్రీముఖి పేరే వినిపిస్తుంది అంటే ఈమె ఎంతలా క్రేజ్ తెచ్చుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు అలాగే ఈమె బుల్లితెర మీద ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని రన్నరప్ గా నిలిచింది.
బిగ్ బాస్ షో వల్ల శ్రీముఖి మరింత ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం బుల్లితెర మీద కొన్ని ఈవెంట్ల లో యాంకర్ గా చేస్తూ అలాగే ఆడియో రిలీజ్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కూడా యాంకర్ గా చేస్తుంది. శ్రీముఖి ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లికి దూరంగా ఉంటుంది.అయితే దానికి ప్రధాన కారణం ఆమె చేసిన ఒక తప్పేనట. ఇక అదేంటంటే..శ్రీముఖి చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించిందట. ఇక వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ చాలా ఎంజాయ్ చేశారట.ఈ నేపథ్యంలోనే అతను చేసే కొన్ని పనులు నచ్చక శ్రీముఖి అతన్ని దూరం పెట్టిందట. ఆ అబ్బాయి మాత్రం శ్రీముఖిని వాడుకోవాలనే ఉద్దేశంతో వదలకుండా ఫోన్లు చేసి విసిగించేవాడట.
శ్రీముఖి మాత్రం అతను ఎన్ని ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్నా పదే పదే విసిగించేవాడట. శ్రీముఖి దూరం పెడుతుంది అనే విషయాన్ని గ్రహించిన ఆ అబ్బాయి ఆమెను చిత్ర హింసలు చేస్తూ చాలా వల్గర్ గా ఆమె గురించి మాట్లాడేవాడట.అంతేకాదు అలాగే పిచ్చిపిచ్చి వీడియోలు, ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన ఫోటోలను ఆమెకు పంపిస్తూ శ్రీముఖి ని చాలా టార్చర్ చేశాడట.ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పలేక తనలో తానే కుమిలిపోయి ప్రేమించి ఇంత పెద్ద తప్పు చేశానా అంటూ చాలా డిప్రెషన్ లోకి వెళ్లి ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకుందట.అప్పట్లో శ్రీముఖి సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఎన్నో వార్తలు వినిపించాయి. మెల్లిమెల్లిగా ఆ డిప్రెషన్ నుండి కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారి ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. ఆ గతం నుండి బయటపడినా కూడా శ్రీముఖి పెళ్లి చేసుకోమంటే మాత్రం నో అంటుందట. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి శ్రీముఖి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతుందో వేచి చూడాలి..!!