జబర్దస్త్‌కు తిరిగి వచ్చిన సత్య శ్రీ.. చమ్మక్ చంద్రతో విబేధాలే కారణమా..!?

Anilkumar
ఈటివిలో ప్రసరమయ్యే జబర్దస్త్ షోలోకొ వచ్చే వారు వస్తూనే ఉంటారు.. పోయే వారు పోతూనే ఉంటారు.ఇక  జబర్దస్త్, మల్లెమాల చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.అయితే నాగబాబు బయటకు రావడం, నితిన్ భరత్ డైరెక్టర్లు కొత్త షోలు పెట్టుకోవడంతో జబర్దస్త్ షోలో చీలికలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే.ఇక  ఆ సమయంలో నాగబాబుతో చాలా మంది బయటకు వచ్చారు. అందులో చమ్మక్ చంద్ర ముఖ్యుడు.అయితే అప్పటికే చమ్మక్ చంద్ర స్కిట్లు టాప్ రేటింగ్‌లో దూసుకుపోతుండేవి.

ఇదిలావుంటే  చంద్ర టీంలో అంతకు ముందు లేడీ గెటప్పులుండేవారు. లేదంటే  ఇక చంద్రనే ఆడ వేషం వేసేవాడు. కానీ ఒక్కసారి సత్య ఎంట్రీ ఇచ్చాక టీం మరింతగా మారిపోయింది. సత్య కామెడీ టైమింగ్, ఇద్దరి కో ఆర్డినేషన్ బాగానే క్లిక్ అయింది. ఇక అలా చమ్మక్ చంద్ర, సత్యలు బాగానే స్కిట్లు నడిపించారు. చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడంతో అతనితో పాటు సత్య కూడా వెళ్లిపోయింది.ఇకపోతే కామెడీ స్టార్స్ అంటూ స్టార్ మాలో కొన్ని రోజులు సందడి చేసింది. ఇక అంతకు ముందు జీ తెలుగులో అదిరింది అనే షోను చేశారు.

అయితే  ఇప్పుడు సత్య అయితే మళ్లీ జబర్దస్త్ షోకు తిరిగి వచ్చింది. కానీ  ఇక చమ్మక్ చంద్ర మాత్రం తిరిగి రాలేదు. ఆయన ఇంకా స్టార్ మాలోనే ఉన్నాడు. ఈమె మాత్రం ఈటీవీలోకి వచ్చింది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమోను వదిలారు.ఇదిలావుంటే  అందులో సత్య కనిపించింది. అయితే ఇక చమ్మక్ చంద్ర కూడా వస్తాడా? లేదంటే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఆమె ఇలా బయటకు వచ్చిందా? అన్నది తెలియడం లేదు.కాగా తన గురువు చమ్మక్ చంద్ర అని, ఆయన బయటకు రావడంతోనే తాను కూడా వచ్చానంటూ.. సత్య ఆ మధ్య చెప్పుకొచ్చింది. కానీ ఇక  ఇప్పుడేమో ఇలా తన గురువుని వదిలేసి జబర్దస్త్ షోకు వచ్చింది. తాగుబోతు రమేష్ టీంలో సత్య కనిపించింది. అయితే అసలే రమేష్ టీం గాల్లో దీపంలా ఉంది.  ఇక ఆయన స్కిట్లు ఒక్కటి కూడా పేలడం లేదు. ఆ టీంలోకి సత్య రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: