ఆ నేపథ్యంలో సాగనున్న ఎన్టీఆర్ 30వ సినిమా..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో మరొక హీరోగా నటించాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ లో జాహ్న కపూర్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీ ని దాదాపు తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ మెడికల్ మాఫియా నేపద్యంలో సాగబోతున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజంగా ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగడం లేదు అని ,  ఈ మూవీ వాటర్ బేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొంద బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: