మహాభారత పాత్రలకు మన హీరోల్లో ఎవరు సెట్ అవుతారు?

Purushottham Vinay
మహా భారతాన్ని మన స్టార్ నటి నటులు తీస్తే చూడాలని ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా అనుకుంటారు.ముఖ్యంగా ఇలాంటి పురాణగాథలను తెరకెక్కించడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెట్టింది పేరు. ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీ ముందుంటుంది.ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, ఏఎన్నార్, కృష్ణం రాజు వంటి లెజెండరి స్టార్ హీరోస్ ఈ పౌరాణిక పాత్రలతో ఎంతగానో మెప్పించారు. రామయణం, మహాభారతం, లవకుశ, మాయాబజార్, శ్రీకృష్ణర్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం వంటి సినిమాలు ఇప్పటికీ ఆ పాత మధురాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ కూడా రాముడు.. కృష్ణుడు అనగానే ఠక్కున తెలుగువారి హృదయాల్లో నిలిచే రూపం ఎన్టీఆర్ దే. అర్జునుడుగా సూపర్ స్టార్ కృష్ణ, కర్ణుడిగా రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఆకట్టుకున్నారు.ఇక ఆ తర్వాత కాలంలో పౌరాణికాలకు నాటకీయతను జోడించి సోషియే ఫాంటసీ పేరుతో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పటికీ అనేక ఇతిహాసాలు వెండితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.అయితే మహా భారతాన్ని ఇష్టపడని భారతీయుడు అంటూ ఉండడు. దీన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటికీ కూడా కలలు కంటున్నారు.


ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు జక్కన్న చెప్పుకొచ్చారు. అయితే మహాభారతంలోని కొన్ని పాత్రలకు మన సౌత్ స్టార్స్ ఎవరు ఏ పాత్రకు సూట్ అవుతారో తెలియజేస్తూ.. ఓ నెటిజన్ సరదాగా గ్రాఫిక్ డిజైన్ చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, సమంత, నయనతార వంటి స్టార్లను ఒక్కో పాత్రకు డిజైన్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. వీడియో చూసిన నెటిజన్స్ సూపర్.. చాలా అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ వీడియోలో.. ముందుగా కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేష్ లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత అర్జునుడిగా సూర్య.. ద్రౌపదిగా హీరోయిన్ ఆసిన్.. విజయ్ దళపతి.. యుధిష్టుడి పాత్రలో.. భీముడిగా ఆర్ మాధవన్.. దుర్యోధనుడి పాత్రలో ప్రభాస్.. కుంతిదేవిగా అనుష్క శెట్టి.. గాంధారి పాత్రలో లేడీ నయనతార, దృతరాష్ట్రుడిగా జయం రవి నటించగా.. కర్ణుడి పాత్రలో విక్రమ్.. భీష్ముడిగా కమల్ హాసన్.. శకునిగా కార్తి.. ద్రోణచార్యుడిగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా సుభద్రగా సమంత సెట్ అవుతున్నట్లు అందంగా సెట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: