"ఎన్టీఆర్ 30" వ మూవీ కోసం అంత మంది టాప్ టెక్నీషియన్స్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందపోతుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ క్రేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో మెడికల్ మాఫియా నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయికి మించి మూవీ ని రూపొందించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ , జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం కొరటాల శివ అదిరిపోయే టెక్నీషియన్స్ ను ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడి గా ఎంపిక చేసుకున్నారు. అలాగే అద్భుతమైన సినిమా టోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. అలాగే శేఖర్ ప్రసాద్ ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయనున్నాడు.

ప్రొడక్షన్ డిజైనర్ గా ఈ మూవీ కి సబు సైరల్ పని చేయనున్నాడు. ఇలా ఇండియా లోనే అత్యంత క్రేజ్ ఉన్న టెక్నీషియన్స్ ఎన్టీఆర్ 30 వ మూవీ కోసం పని చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ మూవీ ని భాషల్లో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ మూవీ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: