బాలీవుడ్ హాట్ బ్యూటీ వలలో తెలుగు మేకర్స్..!

shami
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా తన హాట్ గ్లామర్ షోతో అక్కడ ఆడియన్స్ ని అలరిస్తుంది. అయితే అదే ఊపుతో అమ్మడు సౌత్ సినిమాల వైపు వచ్చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఊర్వశికి మంచి ఛాన్సులు వస్తున్నాయి. సంపత్ నంది నిర్మాతగా బ్లాక్ రోజ్ సినిమా చేసిన ఊర్వశి లేటెస్ట్ గా రామ్ పోతినేని సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ అయ్యింది. ఇక ఆ నూవీ చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి వాళ్తేరు వీరయ్య మూవీలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ మూవీలో కూడా ఊర్వశి స్పెషల్ సాంగ్ కోసమే ఓకే చెప్పినట్టు టాక్.
టాలీవుడ్ లో ఒకేసారి రెండు పెద్ద ఆఫర్లతో ఊర్వశి తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా చిరు సినిమాలో ఐటం సాంగ్ క్లిక్ అయితే మాత్రం అమ్మడికి తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే తన హాట్ ఫోజులతో అదరగొట్టేస్తున్న ఊర్వశి టాలీవుడ్ లో వరుస ఛాన్సులు వస్తే మాత్రం ఇంకాస్త రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. అనూహ్యంగా ఊర్వశికి తెలుగులో రెండు క్రేజీ ఆఫర్లు రావడంతో అమ్మడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. పర్ఫెక్ట్ ఐటం సాంగ్ హీరోయిన్ గా ఊర్వశి రచ్చ చేయాలని చూస్తుంది.
కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటిస్తున్నారు. సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ కాగా రవితేజ కి జోడీగా ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అన్నయ్య మూవీ తర్వాత చిరుతో రవితేజ కలిసి సినిమా చేస్తున్నారు. మరి మాస్ మెగా కాంబో ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.  రామ్ బోయపాటి మూవీలో కూడా ఊర్వశి ఐటం సాంగ్ అదిరిపోతుందని తెలుస్తుంది. సో చూస్తుంటే ఊర్వశి ఈ రెండు సినిమాల తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ మకాం మార్చే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: