విజయవాడలో మహేష్ అభిమానుల భారీ ర్యాలీ.. వైరల్?

Purushottham Vinay
ఇండియన్  సినిమా ఇండస్ట్రీకి అండరేటెడ్ మెయిన్ పిల్లర్ గా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి అప్పుడే వారం రోజులు అయినా కూడా ఆయన కుటుంబ సభ్యులు, వీరాభిమానులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వర్గాలవారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నవంబర్ 15 తెల్లవారు జామున అందర్నీ శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారు మన సూపర్ స్టార్ కృష్ణ. మూడవ రోజు సినీ ప్రముఖులతో కలిసి కృష్ణ చిన్నకర్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు. కాగా నేడు (నవంబర్ 21) తండ్రి అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేయడానికి ఆయన ముద్దుల తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి విజయవాడకు వెళ్లారు.హైదరాబాద్ నుండి స్పెషల్  ఫ్లైట్ లో బయలుదేరిన మహేష్ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి చేరుకున్నారు. దీనికోసం అక్కడి ధర్మ నిలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి. 


నాన్నగారు కృష్ణ గారి అస్థికల్ని శాస్త్రోక్తంగా ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు మహేష్. మహేష్ బాబు విజయవాడ రానున్నారనే వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు.. ఈ కష్టసమయంలో తమ అభిమాన హీరోకి అండగా నిలబడడం అనేది తమ వంతు బాధ్యతగా భావించి.. పొద్దున్నే కృష్ణ చిత్ర పటాలు చేతపట్టుకుని భారీగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.మహేష్ బాబు ప్రయాణించే దారిలో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తనతో పాటు బాబాయ్ ఆదిశేష గిరి రావు, బావలు సంజయ్ స్వరూప్, సుధీర్ బాబు, దర్శకులు త్రివిక్రమ్, మెహర్ రమేష్ ఇంకా అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉన్నారు. మహేష్ అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ ఆదివారం (నవంబర్ 20) తాత స్వగ్రామం బుర్రిపాలెం చేరుకున్నాడు.


అక్కడ బంధుమిత్రులు ఇంకా అలాగే అభిమానులు ఘనస్వాగతం పలికారు. కృష్ణ గారి మరణంతో బుర్రిపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి.ఇక మహేష్ బాబు అక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇంకా అలాగే నవంబర్ 27న హైదరాబాద్, ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో దశదిన కర్మ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు విజయవాడ చేరుకున్న విజువల్స్, ఫ్యాన్స్ ర్యాలీ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: